ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ సోదరుడు ఎల్విన్ తనను చంపాలని చూస్తున్నాడని వర్థమాన నటి దివ్య ఆరోపించింది. పోలీసులతో కుమ్మక్కై తనను చంపడానికి కుట్ర పన్నుతున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేసింది.
గతంలోనే ఎల్విన్ పై ఆమె ఆరోపణలు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తనను వారు చంపాలని చూస్తున్నారంటూ దివ్య ఓ టీవీ ఛానల్ ను ఆశ్రయించింది. హైదరాబాద్ పోలీసు అధికారి రవీందర్ రెడ్డితో కలిసి తనను వేధిస్తున్నారని ఆమె గతంలో ఆరోపించింది.
లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్, అప్పటి మారేడుపల్లి ఇన్స్ పెక్టర్, ప్రస్తుత ఏసీపీ రవీందర్ రెడ్డి కలిపి తనను ఆరేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నారని.. ఇరువురూ కలిసి తన జీవితాన్ని నాశనం చేశారని వాపోయింది. ప్రేమ పేరుతో ఎల్విన్ వేధించాడని.. అతడిపై ఫిర్యాదు చేస్తే రవీందర్ రెడ్డి పట్టించుకోలేదని తెలిపింది.
పైగా తనను బ్రోతల్ కేసులో ఇరికించి అన్యాయంగా 21 రోజులు జైలులో ఉంచారని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో వారిద్దరి నుంచి తనను కాపాడాలని కోరింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు సైతం వినతిప్రతం పంపించినట్టు వెల్లడించింది.
Recent Random Post: