కపూర్ కుటుంబంలో మరో విషాదం… రాజీవ్ కపూర్ కన్నుమూత

బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కపూర్ కుటుంబం మరో వ్యక్తిని కోల్పోయింది. రిషి కపూర్, రణధీర్ కపూర్ ల సోదరుడు రాజీవ్ కపూర్ ఈరోజు కన్నుమూశారు. నటుడగా, దర్శకుడిగా రాజీవ్ కపూర్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అందరూ రాజీవ్ ను చింపు అని పిలిచేవారు. రాజీవ్ కు కేవలం 58 సంవత్సరాలు మాత్రమే.

మంగళవారం మధ్యాహ్నం సమయంలో రాజీవ్ కు గుండెపోటు రావడంతో చెంబూర్ లోని వారి నివాసానికి సమీపంలో ఉన్న ఆసుపత్రిలో రాజీవ్ ను చేర్పించారు. అయితే వైద్యులు ఎంతలా ప్రయత్నించినా రాజీవ్ ను కాపాడుకోలేకపోయారు.

గతేడాది ఏప్రిల్ లో రిషి కపూర్ కన్నుమూసిన విషయం తెల్సిందే. ఏడాది తిరక్కుండానే వారి కుటుంబం మరో సభ్యుడ్ని కోల్పోయింది. రాజీవ్ కపూర్ మరణ వార్త విన్న అభిమానులను కలచివేసింది. రామ్ తేరి గంగా మెయిలీ, ఏక్ జాన్ హై జామ్ వంటి చిత్రాల్లో రాజీవ్ కపూర్ నటించారు.


Recent Random Post: