మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చ్ 27న తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో తన స్పెషల్ ఫ్యాన్ ను కలిశాడు రామ్ చరణ్. కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ లో శ్రీమతి సుదర్శన్ బొడ్డు రామ్ చరణ్ కోసం చీపురు పుల్లలతో ఇల్లు నిర్మించానని, తనను కలిసి స్వయంగా అది బహుమతిగా ఇచ్చే అవకాశం కల్పించాలని అన్నారు.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఆమె కోరికను మన్నించాడు. ఈరోజు ఆమెను స్వయంగా కలిసి కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆమెతో ఫోటోలు దిగారు. రామ్ చరణ్ ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చాలా సన్నగా కనిపిస్తున్నాడు రామ్ చరణ్. వైట్ షర్ట్ పైన స్ట్రైప్స్ షర్ట్, డెనిమ్ ప్యాంట్ ను వేసుకున్నాడు చరణ్. బ్లాక్ కలర్ మాస్క్, సన్ గ్లాసెస్ లో రామ్ చరణ్ అదిరిపోయాడు.
Posted inTelugu - Featured Telugu - Film News
