బ్రేకింగ్ న్యూస్: రామ్ చరణ్ కి కరోనా పాజిటివ్.. కానీ నో సింటమ్స్.!

దాదాపు అన్ని లాక్ డౌన్ సడలింపులు అన్నీ జరిగిపోయాయి.. దాంతో నార్మల్ లైఫ్ దాదాపు మొదలైపోయింది, సినిమా షూటింగ్స్, సినిమా రిలీజులు కూడా మొదలయ్యాయి. కానీ సినిమా షూటింగ్స్ లో మాత్రం ఎప్పటికప్పుడు స్టార్స్ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేరారు.

రామ్ చరణ్ తనకి కరోనా పాజిటివ్ అనే విషయాన్ని రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘ నాకు కరోనా పాజిటివ్ డిటెక్ట్ అయ్యింది. కానీ ఎలాంటి సింటమ్స్ లేవు. ప్రస్తుతానికి ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను. గత కొద్దీ రోజులుగా నన్ను కలిసిన వారు ఎవరైనా సరే టెస్ట్ చేశయించుకోండి. త్వరలోనే కోలుకొని, మరింత స్ట్రాంగ్ గా మీ ముందుకు వస్తానని’ రామ్ చరణ్ అన్నారు.

త్వరలోనే రామ్ చరణ్ తన ఫాదర్ తో కలిసి నటిచనున్న ఆచార్య కోసం డేట్స్ కూడా అలాట్ చేశారు. త్వరలోనే కోలుకొని సెట్స్ లో జాయిన్ అవుతారని ఆశిద్దాం.


Recent Random Post: