అత్తారింటికి వెళ్లిన రానా.. విశేషమేమిటంటే!

రానా దగ్గుబాటి ఇంటీరియర్ ప్రొఫెషనల్ కం ఈవెంట్ మేనేజర్ మిహీక బజాజ్ ని వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ జంట లైఫ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ప్రతి ఫోటో అభిమానుల్లో వైరల్ అయ్యాయి.

గురువారం రానా బంటీ బజాజ్ పుట్టినరోజు సందర్భంగా అత్తారింటిని సందర్శించారు. అందుకు సంబంధించిన ఓ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో రానాతో పాటు అతని భార్య మిహీకా బజాజ్.. ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. మిహీకా బజాజ్ హైదరాబాద్ బజాజ్ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తల్లి బంటీ -తండ్రి సురేష్ బజాజ్ `క్రిసాలా ఆభరణాలు` అనే కోచర్ జ్యువెలరీ బ్రాండ్ స్థాపకులు. మిహీకా బజాజ్ ఇంటీరియర్ డెకర్ .. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరుతో ఈవెంట్ మేనేజ్ మెంట్ బిజినెస్ చేస్తున్నారు.

అల్లుడు రానా రాకతో బంటీ బజాజ్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. “నా పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసినందుకు నా కుటుంబానికి ధన్యవాదాలు“ అని వ్యాఖ్యను జోడించారు.

గత ఏడాది ఆగస్టులో హైదరాబాద్ లో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో రానా దగ్గుబాటి- మిహీకా వివాహం జరిగింది. ఆహ్వానాలు అందుకున్న 30 మంది అతిథులలో దగ్గుబాటి కుటుంబ సభ్యులు కాకుండా.. రానా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ అతని భార్య ఉపసనా.. అల్లు అర్జున్ కూడా ఉన్నారు.


Recent Random Post: