సుధీర్‌ పెళ్లికి వెళ్లి కన్నీరు పెట్టుకున్న రష్మీ గౌతమ్‌


తెలుగు బుల్లి తెర సూపర్‌ హిట్‌ కపుల్‌ గా పేరు దక్కించుకున్న సుధీర్ మరియు రష్మీ గౌతమ్‌ లను ప్రేక్షకులు విడి విడిగా చూడాలంటేనే ఆసక్తి చూపడం లేదు. ఇద్దరు కలిస్తేనే మ్యాజిక్ క్రియేట్‌ అవుతుందని అంటున్నారు. బుల్లి తెరపై వారిద్దరు కలిసి చేస్తున్న సందడితో ప్రేక్షకులు తెగ ఎంటర్ టైన్‌ అవుతున్నారు. వారు జబర్దస్త్‌ మరియు ఢీ డాన్స్ షోల్లో సందర్బానుసారంగా లవర్స్ గా మారిపోతూ ఉంటారు. కాని ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ వారు చెబుతూ వస్తున్నారు. పదే పదే వారిద్దరు చెబుతున్నా కూడా ఇద్దరి మద్య ఏదో ఉందనే చెబుతున్నారు.

జబర్దస్త్‌ మరో ఎపిసోడ్‌ లో వీరిద్దరికి సంబంధించిన రొమాన్స్ ను హైలైట్‌ చేయబోతున్నారు. వచ్చే వారం ప్రసారం కాబోతున్న జబర్దస్త్‌ కు సంబంధించిన ఎపిసోడ్‌ ప్రోమో విడుదల అయ్యింది. ఆ స్కిట్‌ లో సుధీర్‌ పెళ్లికి సిద్దం అవుతాడు. ఆ సమయంలో రష్మీ వెళ్లి కన్నీరు పెట్టుకుంటుంది. రష్మీ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే జబర్దస్త్‌ శ్రీను వారిద్దరి మద్య చాలా జరిగింది. అందుకే సుధీర్ పెళ్లి చేసుకుంటూ ఉంటే రష్మీ ఏడుస్తుందని పెళ్లి చెడగొడతాడు. మొత్తానికి ఈ స్కిట్ తప్పకుండా ఆకట్టుకుంటుందని ప్రోమో చూస్తుంటేనే అర్థం అవుతుంది.


Recent Random Post: