కేజీఎఫ్‌ 2ను ఆకాశానికి ఎత్తని వర్మ

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా కూడా వివాదాస్పదంగా ఉండేలా ప్లాన్‌ చేస్తాడు. ప్రతి సారి కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కాని ఈసారి రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన బాహుబలి సినిమా కంటే మించి కేజీఎఫ్‌ 2 సినిమా నిలవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు కన్నడ అభిమానులు గర్వించేలా ప్రశాంత్ నీల్‌ చేశాడు అంటున్నారు.

కేజీఎఫ్‌ 2 టీజర్ రికార్డును ప్రస్థావించిన రామ్‌ గోపాల్‌ వర్మ ఆర్ఆర్‌ఆర్‌ టీజర్స్ విషయంలో కూడా స్పందించాడు. ప్రశాంత్ వర్మ భారీగా కేజీఎఫ్ 2 ను తెరకెక్కించి మొత్తం దేశం తనవైపు తిరిగి చూసే విధంగా చేసుకున్నాడు. ఒకానొక సమయంలో కన్నడ సినిమాలు అంటే పెద్దగా జనాలు చూసేవారు కాదు. కాని ఇప్పుడు అందరు కూడా కేజీఎఫ్ 2 వైపు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా అది ప్రశాంత్‌ నీల్‌ ప్రతిభ అన్నట్లుగా వర్మ ట్వీట్‌ చేశాడు. ఇక క్రాక్‌ సినిమాపై కూడా పాజిటివ్ గా వర్మ స్పందించి గోపీచంద్‌ మలినేనికి అభినందనలు తెలియజేశాడు.


Recent Random Post: