జబర్దస్త్ తెర వెనుక జరిగే విషయాలను రివీల్ చేసిన రాకెట్ రాఘవ

తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా అత్యధిక టిఆర్పిలతో దూసుకుపోతోంది ఈ కామెడీ ప్రోగ్రామ్. జబర్దస్త్ మొదలైనప్పటి నుండి రాకెట్ రాఘవ టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు.

ఎంతో మంది టీమ్ లీడర్స్ వచ్చి వెళ్లిపోయారు కానీ రాకెట్ రాఘవ మాత్రం జబర్దస్త్ లో ఇంకా కొనసాగుతున్నాడు. ఈ మధ్యే జబర్దస్త్ అనుభవాల గురించి రాఘవ చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ లో సీనియర్స్ నుండి నేర్చుకున్నట్లు గానే తాను ఇప్పుడొస్తున్న కొత్త తరం వారి నుండి నేర్చుకున్నట్లు తెలిపాడు.

ఎప్పుడైనా స్కిట్ సరిగా లేకపోతే రూమ్ లోకి పిలిచి మరీ క్లాస్ తీసుకుంటారు. అంతంత రెమ్యునరేషన్లు తీసుకుంటారు కదా స్కిట్ సరిగా చూసుకోవద్దా అని నాగబాబు అప్పట్లో క్లాస్ పీకేవారని, ఏమైనా తప్పులు ఉన్నా ముఖం మీదే చెప్పేవారని తెలిపాడు రాఘవ.


Recent Random Post: