ఆర్‌ఆర్ఆర్‌కు మళ్లీ లీక్ దెబ్బ

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి కి బాహుబలి సమయంలో లీక్ లు ఎంతగా ఇబ్బంది పెట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుండి జక్కన్న లీక్ లతో పోరాటం చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి ఆయన ఆర్ఆర్ఆర్‌ లీక్ వల్ల తల పట్టుకునే పరిస్థితి వచ్చింది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లుక్ లు బయటకు రావడం జరిగింది. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్‌ పులితో ఫైట్‌ చేసే సన్నివేశంకు సంబంధించిన ఫొటో మరియు చరణ్‌ పోలీస్‌ గెటప్ లో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ రెండు ఫొటోలతో పాటు కొన్ని విజువల్‌ ఎఫెక్ట్‌ షాట్స్ కూడా బయటకు వచ్చాయి. దాంతో ప్రస్తుతం నెట్టింట ఈ పిక్స్ తెగ షేర్‌ అవుతున్నాయి. పెద్ద ఎత్తున రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కు మొదటి నుండి లీక్ ల బెడద తప్పడం లేదు. సెట్‌ లో యూనిట్‌ సభ్యులు ఎవరు కూడా ఫొటోలు తీయకుండా మొబైల్ లు తీసుకున్నారు. కాని ప్రీ ప్రొడక్షన్ వర్క్ సమయంలో మాత్రం వాటిని ఆపడం జక్కన్న తరం కావడం లేదు. ఈ పిక్స్ వల్ల సినిమా క్రేజ్‌ తగ్గుతుంది అంటూ యూనిట్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డిలీట్‌ చేయించినా కూడా జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది.


Recent Random Post: