స్టార్‌ దర్శకుడు తన జననాంగంను టచ్‌ చేయమని బలవంతం చేశాడు

బాలీవుడ్‌ లో కాస్టింగ్‌ కౌచ్‌ మరియు లైంగిక వేదింపులు ఎప్పటి నుండో కొనసాగుతున్నాయి. అయితే కొందరు ఈమద్య మీటూ అంటూ గత చేదు అనుభవాలను బయట పెడుతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు హీరోయిన్స్‌ స్టార్‌ దర్శకులను టార్గెట్‌ చేసి మరీ ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ షర్లిన్ చోప్రా ప్రముఖ దర్శకుడు షాజిద్‌ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. గతంలోనే ఈయనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈయన విషయం చర్చనీయాంశం అయ్యింది.

షాజిద్‌ ఖాన్‌ ను తాను మొదటి సారి 2005 లో కలిశాను. ఆ తర్వాత నేను ఆయన్ను కలిసిన సమయంలో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆయన జననాంగంను బయటకు పెట్టి పట్టుకుని ఎలా ఉందో ఫీల్‌ అవ్వమన్నాడు. ఆయన చేసిన పనితో నాకు కోపం వచ్చింది. నేను ప్రత్యేకంగా జననాంగం పట్టుకుని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నాకు తెలుసు అన్నాను. మేము ఆ తర్వాత కలిసింది లేదు. బాలీవుడ్‌ లో చాలా స్ట్రాంగ్ గా మాఫియా ఉందంటూ ఆమె చెప్పుకొచ్చింది.


Recent Random Post: