‘సలార్‌’ గురించి రెండు గుడ్‌ న్యూస్‌ లు చెప్పిన ప్రశాంత్‌ నీల్‌

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్‌’ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్‌ ముగింపు దశకు వచ్చింది. సింగరేణి బొగ్గు గనుల్లో ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ ను చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ షెడ్యూల్‌ సందర్బంగా దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులకు రెండు గుడ్‌ న్యూస్ లు చెప్పాడు. మొదటి నుండి సలార్‌ మూవీ కన్నడ హిట్‌ మూవీ ఉగ్రంకు రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి. దాంతో పాటు సినిమా విడుదల తేదీ గురించి రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.

మీడియాలో ఇష్టానుసారంగా వచ్చిన పుకార్లకు ఫుల్‌ స్టాప్ పెట్టాడు. ఈ సినిమా ఉగ్రం సినిమాకు రీమేక్ కానే కాదు అంటూ క్లారిటీ ఇవ్వడంతో పాటు పూర్తి కొత్త కథతో సలార్‌ రూపొందిస్తున్నట్లుగా ప్రకటించాడు. దాంతో సలార్‌ సినిమాపై ఉన్న అనుమానాలకు తెర పడ్డట్లయ్యింది. ఇక సలార్‌ మూవీ విడుదల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. అక్టోబర్‌ వరకు సినిమా షూటింగ్‌ ను పూర్తి చేసి జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఈ రెండు విషయాలు కూడా ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ లు గా చెప్పుకోవచ్చు.


Recent Random Post: