సమంత విలన్ పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అదే విధంగా తమిళుల నుండి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎందుకంటే ఈ సిరీస్ లో రాజీ అనే టెర్రరిస్ట్ పాత్రను పోషించింది సమంత. ఇది తమిళుల కోసం పోరాడే ఒక గ్రూపును తీవ్రవాదులుగా ఈ సిరీస్ లో చిత్రీకరించారు అంటూ ఒక వర్గం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ను ఆపేయాల్సిందే అని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తమిళ నటుడు, రాజకీయ నాయకుడు సీమాన్ సమంత తమిళురాలై ఉండి అలాంటి పాత్ర పోషించినందుకు అందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసాడు.
అంతే కాకుండా ఒక వేళ వెబ్ సిరీస్ ను ప్లాన్ ప్రకారమే విడుదల చేస్తే సమంత, స్ట్రీమింగ్ యాప్, దర్శకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బెదిరించాడు కూడా.
Recent Random Post: