సమంత అలా చేసినా ఆశ్చర్యపోయే అవసరం లేదా..??

బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజపేయ్ ప్రధానపాత్రలో నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. ఈ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ గురించి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి సౌత్ ప్రేక్షకులు ఎక్కువ ఇంటరెస్టింగ్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ ఈ వెబ్ సిరీస్ సీక్వెల్ తో డిజిటల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనుంది. ఇదివరకే ఆహా ఓటిటి వేదిక పై సామ్ జామ్ అనే షోను హోస్ట్ గా నడిపింది సామ్. ఆ సామ్ జామ్ షో మంచి క్రేజ్ సంపాదించుకుని ఫస్ట్ సీసన్ ముగిసింది.

ఇప్పుడు హిందీలో సూపర్ హిట్ అయినటువంటి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ సీక్వెల్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సీసన్ లో నటించే సరికి ఓటిటి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మోస్ట్ అవెయిటింగ్ సెకండ్ సీసన్ ట్రైలర్ కూడా ఇటీవలే రిలీజ్ చేసింది బృందం. అలాగే జూన్ 4న రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జూన్ 4కు రెండు రోజులే టైం ఉండటంతో సోషల్ మీడియాలో ఫ్యామిలీ మ్యాన్ ఫీవర్ మొదలైంది. ట్రైలర్ చూస్తే ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అందులోను సమంత టెర్రరిస్ట్ రాజీ పాత్రలో డి-గ్లామరస్ గా కనిపిస్తుంది. కానీ రాజీ క్యారెక్టర్ వెనుక ఏదో బడా మేటర్ దాగి ఉందని అర్ధమవుతుంది.

ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఒక బాంబ్ చుట్టూ తిరుగుతుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. మరి ఆ బాంబు రాజీ పాత్రలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ పెట్టిందా లేకపోతే ఆమె కనిపెట్టనుందా అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ పుణ్యమా అని సౌత్ యాక్ట్రెస్ సమంత పేరు కాస్తా బాలీవుడ్ వర్గాల్లో కూడా వైరల్ అయింది. మరి అమ్మడు క్రేజ్ చూస్తుంటే త్వరలో డైరెక్ట్ బాలీవుడ్ ప్రాజెక్టులు చేసినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. బాలీవుడ్ వర్గాలలో టాక్ ప్రకారం.. బాహుబలి సెకండ్ పార్ట్ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ గురించే జనాలు అంతలా వెయిట్ చేస్తున్నారని కథనాలు చెబుతున్నాయి. 2019 లో ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి కొనసాగింపుగా ఈ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వచ్చేసింది. మేకర్స్ రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ ఇప్పుడే అయిపోదని మరో సీసన్ కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు.. ఇప్పటికే మూడవ సీజన్ స్క్రిప్ట్ రెడీ అయిందని.. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.


Recent Random Post: