సామ్ .. ఏంటా లుక్కు షాక్ తిని గిలగిలా

అక్కినేని కోడలు సమంత మోస్ట్ అవైటెడ్ `ఫ్యామిలీమ్యాన్` సీజన్ 2లో నటించిన సంగతి తెలిసిందే. ఎల్.టి.టి.ఇ రెబల్ పాత్రతో ఊహించని సర్ ప్రైజ్ ట్రీట్ ని ఇవ్వబోతున్న సామ్ ఊహించని వివాదాల్లోకి వచ్చారు. తమిళనాడులో ఈ వివాదాస్పద వెబ్ సిరీస్ ప్రకంపనాలు రేపుతోంది. రాజకీయంగానూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సామ్ ఇటీవల తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు బాలీవుడ్ మీడియాలు సహా టాలీవుడ్ మీడియాలతోనూ ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాల్ని వెల్లడిస్తున్నారు.

మరోవైపు సమంతలోని ఫ్యాషనిస్టా ఊహించని విధంగా బయటపడుతోంది. తాజాగా సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. సామ్ ఈ లుక్ లో చాలా రీఫ్రెషింగ్ గా కనిపిస్తోంది. అవెంజర్స్ స్టార్ లా కనిపిస్తోంది! అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. ముఖ్యంగా సమంత చెవులకు ధరించిన ఆ స్పెషల్ మెటాలిక్ లోలాకులు ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. బర్నింగ్ లైట్ లో డిజైనర్ లుక్ లో సామ్ తళుకుబెళుకులు ఉత్కంఠను పెంచుతున్నాయి.

ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ట్విట్టర్ రివ్యూలు బయటికి వచ్చేశాయి. వ్వావ్.. ఆసమ్.. బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Recent Random Post: