ఏమైందబ్బా.. అడ్రస్సే లేదే ?

అవును గడచిన కొద్ది నెలలుగా సంచైతా గజపతిరాజు ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఆకాశమే హద్దుగా ప్రతిరోజు చెలరేగిపోయారు. ఒకవైపు బాబాయ్ పూసపాటి అశోక్ గజపతిరాజును మరోవైపు చంద్రబాబునాయుడును మధ్యలో అవసరమైనపుడల్లా నారా లోకేష్ టార్గెట్ గా ట్విట్వర్ వేదికగా ప్రతిరోజు ఎంతగా చెలరేగిపోయారో అందరు చూసిందే. ప్రతిరోజు ట్విట్టర్ వేదికగాను మధ్య మధ్యలో మీడియా సమావేశాల్లో కూడా పై ముగ్గిరిపై సంచైత తెగ చెలరేగిపోయారు.

మాన్సాస్ ట్రస్టులో అశోక్ హయాంలో ఎంతగా అన్యాయాలు జరిగింది అక్రమాలు సాగిందనే విషయాలను పూసగుచ్చినట్లు చెప్పేవారు. ట్రస్టును అడ్డుపెట్టుకుని అశోక్ చంద్రబాబు చేసిన నిర్వాకాలంటు ప్రతిరోజు సంచైత పెద్ద జాబితానే జనాలకు వినిపించారు. ట్రస్టులో జరిగిన అక్రమాలంటు విచారణకు ఆదేశించారు. లెక్కల్లో వచ్చిన తేడాలను నిగ్గు తేల్చేందుకంటు ఫోరెన్సిక్ ఆడిట్ ని నియమించారు. దీని కారణంగా ట్రస్టు లెక్కల్లో జరిగిన అవకవతకలన్నీ బయటపడతాయని చెప్పారు.

మరిపుడా ఫోరెన్సిక్ ఆడిట్ ఏమైందో ఎవరికీ తెలీదు. ఎందుకంటే దాదాపు నెలన్నర క్రితం కోర్టు తీర్పు కారణంగా ట్రస్టుకు ఛైర్మన్ గా సంచైత ప్లేసులో మళ్ళీ అశోక్ బాధ్యతలు తీసుకున్నారు. మొదట్లో ప్రభుత్వంపైన సంచైత పైనా రెచ్చిపోయిన అశోక్ కూడా ఇఫుడెందుకో కామ్ గా ఉంటున్నారు. ఎవరెన్ని చెప్పినా ఒక్క విషయం మాత్రం వాస్తవం. గడచిన 17 ఏళ్ళుగా ట్రస్టు లెక్కలను అశోక్ ఆడిటింగ్ చేయించలేదన్నది వాస్తవం. ట్రస్టు ఛైర్మన్ గా ఉన్న వ్యక్తి ప్రాధామిక బాధ్యత ఏమిటంటే లెక్కలను ఆడిట్ చేయించటం. మంత్రిగా దశాబ్దాల పాటు ఎంఎల్ఏగా ఎంపి కేంద్రమంత్రిగా పనిచేసిన అశోక్ కు ఇంతచిన్న విషయం తెలీకుండానే ఉంటుందా.

కావాలనే ఆడిట్ చేయించలేదంటేనే అర్ధం ట్రస్టులో పెద్దఎత్తున గోల్ మాల్ జరిగిందని. ఎప్పటికీ టీడీపీయే అధికారంలో ఉంటుందని తానే ట్రస్టుకు ఛైర్మన్ గా ఉంటానని బహుశా అశోక్ అనుకున్నట్లున్నారు. టీడీపీ ఓడిపోవటం తాను ఛైర్మన్ గా దిగిపోవటంతో ట్రస్టులోని కంపంతా రోడ్డుమీద పడింది. ట్రస్టు లెక్కల్లో తేడాలున్నది ఎంత నిజమో ట్రస్టు ఆస్తులకు రెక్కలొచ్చి ఎగిరిపోవటమూ అంతే నిజం. వేల కోట్ల రూపాయల విలువైన వందలాది ఎకరాలను అశోక్ తనిష్టం వచ్చినట్లు కావాల్సిన వాళ్ళకు లీజుకు ఇచ్చేసింది కూడా నిజమని బయటపడుతోంది.

ఏదేమైనా సంచైత నిర్వహణ ఎలాగుంది ? అంతకుముందు అశోక్ ఛైర్మన్ గిరి ఎలా వెలగబెట్టారనే విషయాలపై జనాల్లో కాస్త క్లారిటి వచ్చేసింది. దశాబ్దాల పాటు తిరుగులేని అధికారం అశోక్ ఇంటిగుప్పిట్లోనే ఉండిపోయింది కాబట్టి మూతబెట్టిన మూకుడు లాగ విషయాలు బయటకు రాకుండా ఉండిపోయాయి. ఎప్పుడైతే సంచైత ట్రస్టు పగ్గాలు అందుకున్నారో వెంటనే కంపంతా ఒక్కసారిగా బయటపడిపోయింది. మరలాంటి సంచైత ట్రస్టు ఛైర్ పర్సన్ గా పక్కకు వెళ్ళిందగ్గర నుండి ఎక్కడా అడ్రస్ కూడా కనబడటంలేదు. మరి ఎక్కడున్నారో ? ఏమి చేస్తున్నారో ?


Recent Random Post: