తన బాడీ గురించి కామెంట్స్ చేసిన వారికి అదిరిపోయే రిప్లై ఇచ్చిన జెర్సీ నటి

బంగారం సినిమాలో హీరోయిన్ చెల్లెలుగా చేసిన అమ్మాయి గుర్తుందా? ఇటీవలే నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కూడా కనిపించింది. ఆమె పేరే సానుష సంతోష్. ఎక్కువగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. మలయాళం, తమిళంలో కలిపి దాదాపు 20 సినిమాలకు పైగా నటించింది సానుష.

ఆ తర్వాత తెలుగులో జీనియస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆమెకు హీరోయిన్ అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఇక సోషల్ మీడియాలో సానుష కొంత మందికి గట్టి కౌంటర్ ఇచ్చింది.

సానుష ఈ మధ్య కొంత బరువు పెరిగిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ఓపిక పట్టిన ఈ మలయాళీ భామ ఇప్పుడు రెస్పాండ్ అయింది. “నా కన్నా నా బరువు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న అందరికీ, జీవితం అంటే సన్నగా, అందంగా కనిపించడానికి మాత్రమే కాదు. వేరొకరి శరీరం గురించి కామెంట్ చేసేటప్పుడు గుర్తించుకోండి. రెండు వేళ్ళు వేరే వాళ్ళవైపు చూపిస్తే మూడు వేళ్ళు మీకే చూపిస్తాయి” అని కౌంటర్ ఇచ్చింది.


Recent Random Post: