కన్నడ హీరోయిన్ షనాయా కాట్వే సొంత తమ్ముడినే హత్య చేసి వార్తల్లో నిలిచింది. ఆమె ప్రియుడి మోజుతో తమ్ముడిని హత్య చేసిందని పోలీసులు నిర్థారించారు. కన్నడ సినిమా పరిశ్రమలో పలువురు హీరోయిన్స్ కు మేనేజర్ గా వ్యవహరించిన నియాజ్ అహ్మద్ తో షనాయా కాట్వే ప్రేమలో ఉంది. కొన్నాళ్ల క్రితం షనాయా కాట్వే తమ్ముడు ఆమెను ప్రేమ విషయమై అడ్డు చెప్పాడు. ఇద్దరిని మందలించే ప్రయత్నం చేశాడు. అప్పటికే ప్రియుడితో మోజుతో పీకల్లోతూ మునిగి పోయిన ఆమె కు తమ్ముడు మాటలు ఆమె చెవులకు ఎక్కలేదు. తమ్ముడిపై కోపంతో రగిలి పోయింది.
తమ్ముడితో గత కొన్నాళ్లుగా పదే పదే గొడవలు పడుతున్న షనాయా కాట్వే ఏకంగా హత్య చేసేంతగా కోపం పెంచుకుంది. ప్రియుడితో తమ్ముడు కలవనీయడం లేదు అంటూ ఆమె లో కోపం కట్టలు తెంచుకుంది. తమ్ముడిని పథకం ప్రకారం చంపేసి డెడ్ బాడీని కారులో దాచిపెట్టింది. ఆ తర్వాత మృతదేహంను ముక్కలు ముక్కలుగా కోసి హుబ్బళ్లిలోని పలు ప్రాంతాల్లో వేసింది. రాకేష్ మృతిపై కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేసిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలినట్లుగా మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.
Recent Random Post: