శ్యామ్ సింగ రాయ్ కు భారీ నష్టం

న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్ సినిమా శ్యామ్ సింగ రాయ్. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని స్పెషల్ సెట్ లో సాగుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అర్ధాంతరంగా ఆపవలసి వచ్చింది.

ఈ చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లలో 5 ఎకరాలలో ఒక ప్రత్యేకమైన సెట్ ను భారీ ఖర్చుతో వేశారు. ఈ సెట్ ను నిర్మించడానికి దాదాపు ఆరున్నర కోట్ల రూపాయల ఖర్చయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా కురిసిన వర్షాలకు, భారీ ఈదురుగాలులకు ఈ సెట్ బాగా నష్టపోయిందట. మళ్ళీ ఈ సెట్ ను పునర్నిర్మించడానికి చాలా ఖర్చు అవుతుంది. సాయి పల్లవి, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను రాహుల్ సంకిట్ర్యాన్ తెరకెక్కిస్తున్నాడు.


Recent Random Post: