సిమ్రాన్ ఫుల్ ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నారు. కథానాయికగా తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌లు అందుకున్న సిమ్రాన్ ఇప్పుడు ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ఉంది. బాలీవుడ్ సూపర్‌హిట్ ఫిల్మ్ ‘అంధా ధున్’ తమిళ రీమేక్‌లో ఆమె నటించనున్నారు. ఆ సినిమాలో తబు చేసిన బోల్డ్ క్యారెక్టర్‌ని సిమ్రాన్ చేయనున్నారు. ఈ సందర్భంగా సిమ్రాన్ మాట్లాడుతూ – ‘‘తబు చేసిన పాత్రను నేను చేయటం పెద్ద బాధ్యతగా అనుకుంటున్నాను. ఈ బోల్డ్ క్యారెక్టర్‌ను ఎంత ఛాలెంజింగ్‌గా చేస్తానో చూడాలి. ఓ కొత్త అవతారంలో కనిపించనున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘అంధా ధున్’ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ చేస్తున్నారు. తెలుగు రీమేక్‌లో నితిన్ చేస్తున్న విషయం తెలిసిందే.
Recent Random Post: