వైసీపీ ‘కోర్టులకు చెవిలో పువ్వులు’ పెడుతోంటే బీజేపీ ఏం చేస్తోంది.?

వైసీపీ, బీజేపీ మధ్య ఎట్టకేలకు ‘రాజకీయ పోరాటం’ మొదలైనట్టుంది. ‘నువ్వు కొట్టినట్లు నటించు, నేను దెబ్బ తగిలినట్లు నటిస్తాను..’ అన్నట్టు కాకుండా ఇది నిజమైన ‘కొట్లాటేనా.?’ అని చాలామందికి అనుమానం వస్తోంది. బీజేపీ – వైసీపీ తెరవెనుకాల నడుపుతున్న స్నేహం అలాంటిది. మిత్రపక్షం జనసేనకు కూడా మస్కా కొట్టి బీజేపీ, వైసీపీతో ‘చాటుమాటు వ్యవహారాలు’ నడుపుతోందన్నది ఓపెన్ సీక్రెట్. ఇక, అసలు విషయానికొస్తే, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీని వెటకారం చేస్తూ ట్వీటేసిన విషయం విదితమే. దానికి అట్నుంచి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నుంచి ఘాటుగా సమాధానమొచ్చింది.

‘మా ఊసు ఎందుకులే విజయసాయిరెడ్డిగారూ.. కోర్టులకు చెవిలో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్ళు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా. తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజీ పువ్వులు మీకు పంపిస్తాం. బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి..’ అని విజయసాయిరెడ్డిపైకి సోము వీర్రాజు ట్వీటాస్త్రం సంధించారు. ఇక్కడ ‘బెయిల్ రద్దు‘ అనే అంశం అత్యంత కీలకమైనది. అతి త్వరలో వైఎస్ జగన్ సహా విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు కాబోతోందన్నది సోము వీర్రాజు చెబుతున్న మాట.

సోము వీర్రాజు ఒక్కరే కాదు, చాలామంది బీజేపీ నేతలు, టీడీపీ నేతలు కూడా ఇదే అభిప్రాయంతో వున్నారు. సరే, బెయిల్ అనేది కోర్టు పరిధిలోని అంశం. కానీ, కోర్టుల చెవిలో విజయసాయిరెడ్డి, వైఎస్ జగన్ పువ్వులు పెడుతోంటే.. బీజేపీ ఏం చేస్తోంది.? కేంద్రంలో అధికారంలో వున్నది బీజేపీనే కదా.! వ్యవస్థల్ని కొందరు వ్యక్తులు భ్రష్టు పట్టించేస్తున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాలి కదా.?

Share


Recent Random Post: