భారత్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మూడేళ్ల క్రితం ఓ బాలీవుడ్ హీరోయిన్ పై చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పంజాబీలో బెస్ట్ ఆఫ్ లక్ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన సోనమ్ భజ్వా తెలుగులో సుశాంత్ హీరోగా వచ్చిన ఆటాడుకుందాం.. రా సినిమాలో నటించింది. విషయమేమిటంటే.. మూడేళ్ల క్రితం తన బెడ్ రూమ్ లో హాట్ స్టిల్ ఇస్తూ.. ‘సూర్యాస్తమయంలో నీ గురించే ఆలోచిస్తున్నా’ అనే క్యాప్షన్ తో ఇన్ స్టాలో ఓ ఫొటో షేర్ చేసింది.
దీనిపై అప్పట్లోనే కేఎల్ రాహుల్.. ‘ఒక్క ఫోన్ కాల్ చేస్తే నీ దగ్గర వాలిపోతా’ అంటూ కామెంట్ చేశాడు. ఆ ఫొటోకు లైక్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్ వైరల్ అవుతోంది. స్టార్ క్రికెటర్ అయుండీ ఇలాంటి కామెంట్ చేస్తాడా,, రాహుల్ లో కొంటెదనం ఎక్కువే అనే కామెంట్లు వైరల్ అవుతున్నాయి. రాహుల్ ప్రస్తుతం సునీల్ సెట్టి కుమార్తె అథియా శెట్టితో ప్రేమాయణంలో ఉన్నాడు.
Recent Random Post: