రఘురామ వైధ్య పరీక్షల రిపోర్ట్‌ కవర్ ను ఓపెన్ చేసిన సుప్రీం

ఏసీపీ అరెస్ట్‌ చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు సికింద్రబాద్ తిరుమలగిరిలోని ఆర్మీ ఆసుపత్రిలో వైధ్య పరీక్షలు నిర్వహించిన విషయం తెల్సిందే. వైధ్య పరీక్షల రిపోర్ట్‌లను వైధ్యుల బృందం హైకోర్టు న్యాయమూర్తి సమక్షంలో సీల్డ్ కవర్‌ లో సుప్రీం కోర్టుకు పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్‌ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టీస్ వినీత్‌ శరన్‌ తమకు అందిందని పేర్కొన్నారు. వైధ్య పరీక్షల రిపోర్ట్‌ ను ఆయన ఓపెన్‌ చేశారు. ఆ రిపోర్ట్‌ ను ముగ్గురు ఆర్మీ వైధ్యులు తయారు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు.

ముగ్గురు వైధ్యులు పరీక్షించి ఎక్స్ రే ను పంపించారు. దాంతో పాటు వారు వీడియోను కూడా పంపారని శరన్‌ తెలియజేశారు. రఘురామ కృష్ణరాజుకు జనరల్‌ ఎడిమా ఉందని.. కాలి వేలు కూడా ప్రాక్చర్ అయ్యిందని దాంతో పాటు కాలికి మరికొన్ని గాయాలు ఉన్నాయని వారు వీడియోలో తెలియజేశారు. రఘురామ కృష్ణరాజు వైధ్య పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్ పై విచారణలు జరగాల్సి ఉంది. ఎంపీ తనను పోలీసులు కొట్టారని.. ప్రభుత్వం తనపై కుట్ర పూరితంగా వ్యవహరించింది అంటూ ఆరోపించాడు. ఈ రిపోర్ట్‌ తో సుప్రీం తీర్పు ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Recent Random Post: