నటిగా సూపరిచితురాలైన సురేఖ వాణి భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. 40 ఏళ్ల సురేఖ మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆమె పెళ్లికి సిద్ధం అంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం సినిమాల్లో నటించే బిజీగా వుంది తప్పితే పెళ్ళిపట్ల ఆసక్తి లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ తాజా ఇంటర్వ్యూ లో మాత్రం తనకు పెళ్లి ఆలోచన ఉందని క్లారిటీ ఇచ్చింది.
అలీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవితంలో అన్ని చూశాను. ఇక పెళ్లి ఆలోచన అయితే ఉంది కాని బాగా డబ్బు ఉన్న వ్యక్తి అయితేనే కావాలంటూ చెప్పుకొచ్చింది. జీవితంలో నేను పడ్డ కష్టాలు చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. ఆమె వయసు 40 ఏళ్ళు మాత్రమే కనుక ఖచితంగానే పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు. కూతురు పెళ్లి తర్వాత ఈమె వివాహం ఉంటుందేమో చూడాలి.
Recent Random Post: