సురేఖా వాణి కూతురు సుప్రీతా సోషల్ మీడియా వాడుతున్న దాదాపు అందరికీ సుపరిచితమే. ఇంకా ఏ సినిమాలోనూ, షో కూడా చేయని సుప్రీతాకు దాదాపు 4 లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. గ్లామరస్ ఫోటోలు పెట్టడం, అప్పుడప్పుడు తల్లితో కలిసి ఎంటర్టైనింగ్ గా రీల్స్ చేస్తుంది సుప్రీతా. మధ్యలో ఫ్యాన్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ వంటివి కూడా పెడుతుంది.
ఈ నేపథ్యంలో రీసెంట్ గా అభిమానులను ఏమైనా ప్రశ్నలు అడగమనగా మీరు వర్జినా అని ఎవరో అడగకూడని ప్రశ్ననే అడిగాడు. దానికి సుప్రీతా మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ ను ఇచ్చింది. ఇటీవలే విడుదలైన వకీల్ సాబ్ చిత్రంలో ఆర్ యూ వర్జిన్ అన్న ఎపిసోడ్ ఉంది కదా. అందులో ప్రకాష్ రాజ్ పదే పదే హీరోయిన్ వర్జినిటీ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ రియాక్షన్ అదిరిపోతుంది. సరిగ్గా ఆ వీడియోనే తన రెస్పాన్స్ గా పోస్ట్ చేసింది సుప్రీతా.
Recent Random Post: