నాన్నతో సినిమా చూస్తున్న సమయంలో రొమాంటిక్ సీన్స్‌ వస్తే..!

సొట్టబుగ్గల చిన్నది తాప్సి బాలీవుడ్ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఏడాదికి కనీసం నాలుగు అయిదు సినిమాలకు కమిట్ అవుతోంది. కరోనా వల్ల ఈ ఏడాది పెద్దగా సినిమాలు లేవు. అయినా కూడా ఈమె మాత్రం తన బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో రెడీ అవుతూనే ఉంది. తాజాగా ఈమె నటించిన హసీన్ దిల్‌రుబా నెట్‌ ప్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యింది. ఆ సందర్బంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఈ అమ్మడు పాల్గొంది. ఆ సమయంలో పలు ఆసక్తికర విషయాలపై స్పందించింది.

తాప్సి మాట్లాడుతూ.. మా ఇంట్లో ఒకే టీవీ ఉంటుంది. నాన్న హాలీవుడ్‌ యాక్షన్‌ మూవీస్ చూసేందుకు ఇష్టపడతారు. ఆయన సినిమా చూడటం మొదలు పెడితే మేము అంతా కూడా సైలెంట్ గా ఆ సినిమాను చూడటం లేదంటే మరేదైనా పని చేసుకోవడం చేయాల్సిందే. సినిమా చూస్తున్న సమయంలో ఏదైనా రొమాంటిక్ సన్నివేశం వస్తుంటే మాకు చెమటలు పట్టేవి. ఆయన ఏం అంటారో అంటూ ఆ సమయంలో కాస్త ఆందోళన కలిగేది. మెల్లగా మంచి నీళ్ల కోసం లేదా మరేదైనా పని కోసం లేచేవాళ్లం లేదంటే ఛానల్‌ అయినా మార్చేవాళ్లం అంటూ తాప్సి చెప్పుకొచ్చింది.


Recent Random Post: