పానీపూరి బండి వాడ్ని పెళ్లి చేసుకోవాలి అనుకునే దాన్ని – తేజస్వి

తెలుగు సినిమాల్లో పలు పాత్రలతో పేరు తెచ్చుకున్న తేజస్వి మడివాడ బిగ్ బాస్ షో తో పాపులారిటీ కంటే విమర్శలను మూటగట్టుకుంది. ఆ సీజన్ లో కౌశల్ తో ప్రవర్తించిన తీరుకి జనాల ఆగ్రహాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, లవర్స్, మనం, హార్ట్ ఎటాక్ వంటి చిత్రాలలో క్యారెక్టర్ పాత్రలు పోషించింది తేజస్వి.

ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ కూడా అయింది. అయితే బిగ్ బాస్ తర్వాత ఈమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తేజస్వి పానీపూరి బండి దగ్గర ఫోటో పోస్ట్ చేసి చిన్నప్పుడు పానీపూరి బండి వాడ్ని పెళ్లి చేసుకోవాలి అనుకునేదాన్ని కానీ ఇప్పుడు పెద్దయ్యాను కదా అసలు పెళ్లే అనవసరమని తెలుసుకున్నాను అని క్యాప్షన్ జోడించింది.

దీనికి కొంత మంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే కొంత మంది మాత్రం జోకులు వేసుకుంటున్నారు.


Recent Random Post: