తమన్నాకు మెగా ఛాన్స్.. ఈసారైనా?

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి దశాబ్దన్నర దాటింది. ఇప్పటికీ మంచి అవకాశాలనే అందుకుంటోంది. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసనా నటించేసింది తమన్నా. అయితే కొంత కాలం నుండి డల్ అయిన తమ్మూ సీనియర్ హీరోలతో, యువ హీరోలతో నటిస్తోంది. వెంకటేష్, చిరంజీవి సరసన ఇప్పటికే సినిమాలు చేసింది. సత్యదేవ్ వంటి యువ హీరోలతో నటిస్తోంది.

ఇదిలా ఉంటే తమన్నా ఇప్పుడు చిరంజీవితో మరోసారి నటించే అవకాశాన్ని కొట్టేసింది. చిరుతో ఇటీవలే సైరాలో కనిపించింది తమన్నా. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ రాగా సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడలేదు. ఇప్పడు మరోసారి మెగాస్టార్ తో స్క్రీన్ చేసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని తమన్నా తెలిపింది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ లో తమన్నా నటిస్తోందని అధికారికంగా ప్రకటించారు. మరి ఈ చిత్రంతోనైనా ఆమె మళ్ళీ టాప్ రేంజ్ కు చేరుకుంటుందేమో చూడాలి.


Recent Random Post: