
ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరుగాంచిన ప్రభుదేవా ఇటీవల చెన్నైలో ఓ అంతర్జాతీయ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించాడు. “ప్రభుదేవా లైవ్ డ్యాన్స్ వైబ్” పేరుతో జరిగిన ఈ కాన్సర్ట్‌కు సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యారు. అయితే ఈ ప్రోగ్రామ్‌లో ఎంతో ప్రత్యేకమైన మూమెంట్ చోటుచేసుకుంది – ప్రభుదేవా తన కొడుకు రిషి రాగ్వేందర్ దేవాను మొదటిసారి ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
తన కొడుకు ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభుదేవా భావోద్వేగ పోస్ట్ చేశాడు. “నా కొడుకు రిషి రాగ్వేందర్ దేవాను పరిచయం చేయడం నాకు గర్వకారణం. మేమిద్దరం కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇది కేవలం డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, అంతకంటే గొప్పది. ఇది నా వారసత్వం – ఇప్పుడే ప్రారంభమవుతున్న ఓ అందమైన ప్రయాణం” అంటూ ప్రభుదేవా భావోద్వేగంగా రాశాడు.
ప్రభుదేవాకు ఇద్దరు పిల్లలు ఉండగా, రిషి రాగ్వేందర్, అదిత్ ఇద్దరిలో రిషి ఇప్పుడు తన టాలెంట్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తండ్రి ప్రభుదేవాతో కలిసి స్టేజ్‌పై స్టెప్పులేయడం అభిమానులను తెగ ఉత్సాహపరిచింది. ఈ వీడియో వైరల్ అవుతుండగా, “రిషి అచ్చం ప్రభుదేవాలానే ఉన్నాడు”, “డ్యాన్స్ కూడా ప్రభుదేవాను తలపిస్తోంది!” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభుదేవా విషయానికొస్తే, యాక్టర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఇలా పలు రంగాల్లో తన సత్తా చాటిన ఆయన, ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేసి డ్యాన్స్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” సినిమాకు దర్శకత్వం వహించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ప్రభుదేవా, ఇప్పటికీ తన డ్యాన్స్ మేనియా కొనసాగిస్తూనే ఉన్నాడు. చెన్నైలో జరిగిన కాన్సర్ట్‌లో అలనాటి హీరోయిన్లు కూడా పాల్గొని ప్రభుదేవాతో స్టెప్పులేయడం మరో విశేషం.
ప్రస్తుతం రిషి రాగ్వేందర్ స్టేజ్ ఎంట్రీపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తుండగా, అతనిలో ఉన్న టాలెంట్ చూసి భవిష్యత్తులో తన తండ్రిని మించిన డ్యాన్స్ లెజెండ్ అవుతాడా? అనే అంచనాలు మొదలయ్యాయి!
Recent Random Post:














