నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటించిన వి సినిమాపై హీరోయిన్ సాక్షి మాలిక్ కేసు పెట్టారు. ఈ సినిమాలో మొబైల్ ఫోన్ లో సెక్స్ వర్కర్ ఫోటోను వేరే వ్యక్తికి చూపించే సీన్ ఉంది. అందులో సాక్షి మాలిక్ ఫోటో వాడారట. తన పర్మిషన్ లేకుండా ఇలా వాడినందుకు వి సినిమా దర్శక నిర్మాతలపై పరువు నష్టం దావా వేసింది సాక్షి మాలిక్.
వెంటనే స్పందించిన న్యాయస్థానం వ్యక్తుల అనుమతి లేకుండా అలా వారి ఫోటోలను వాడటం పరువు నష్టం కిందకు వస్తుందని. వెంటనే ఆమె ఉన్న ఆ సీన్స్ తొలగించి తిరిగి ఓటిటి లో అప్లోడ్ చేయాలని కోర్ట్ ఆదేశించింది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన వి సినిమాను దిల్ రాజు నిర్మించారు. 2020 కరోనా లాక్ డౌన్ టైం లో ఈ సినిమా అమేజాన్ ప్రైం లో డైరెక్ట్ డిజిటల్ రిలీజైంది.
Recent Random Post: