రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కేవలం డబ్బు కోసమే సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కారణంగా సినిమాలు చేయాలని.. సినిమాలు చేస్తేనే తాను పార్టీని నడపగలను అని భావించిన పవన్ ఇప్పటికే నాలుగు అయిదు సినిమాలకు ఓకే చెప్పాడు. ఈయన ప్రతి సినిమాకు కూడా 40 నుండి 50 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈయన రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కోసం ఏకంగా 50 కోట్లను పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే రూ.25 కోట్ల పారితోషికంను దిల్ రాజు నుండి పవన్ అందుకున్నాడు. మరో 25 కోట్లను బిజినెస్ సమయంలో ఇచ్చేట్లుగా ఒప్పందం చేసుకున్నారు. సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు వస్తే వాటాను కూడా ఇచ్చేందుకు దిల్ రాజు ఒప్పుకున్నాడట. ఆ వాట విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ నుండి దిల్ రాజుకు ఏకంగా 50 కోట్లు మాత్రం అందబోతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో మూడు నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా వకీల్ సాబ్ ఆలస్యం అవుతోంది.
షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా వకీల్ సాబ్ సినిమా బడ్జెట్ పెరుగుతోందట. 80 కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్త ఇప్పటికే 90 కోట్ల వరకు చేరిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజుకు బ్రేక్ ఈవెన్ దక్కేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 90 కోట్ల బిజినెస్ చేయడంతో పాటు థియేటర్ల ద్వారా లాభాలు వస్తేనే దిల్ రాజు సేవ్ అవుతాడు అంటున్నారు.
Recent Random Post: