పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వస్తున్న వకీల్ సాబ్ సినిమా కోసం అభిమానులు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా రూపొందిన వకీల్ సాబ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయని అంటున్నారు. వకీల్ సాబ్ సినిమా నుండి వచ్చిన పోస్టర్ లు మరియు పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్న వారి కోసం అప్ డేట్ వచ్చేసింది.
ఈ సినిమా ట్రైలర్ ను ఈనెల 29వ తారీకున భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రథాన పట్టణాలు మరియు నగరాల్లో థియేటర్లలో ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. థియేటర్లలో 29వ తారీకు సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేయబోతున్నారు. థియేటర్ల వద్ద అభిమానుల సందడి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇక అదే రోజు సరిగ్గా సాయంత్రం 6.30 గంటలకు యూట్యూబ్ లో వకీల్ సాబ్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. వకీల్ సాబ్ ట్రైలర్ కట్టింగ్ దాదాపుగా పూర్తి అయ్యిందని థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అద్బుతంగా వచ్చిందని మేకర్స్ అంటున్నారు.
Recent Random Post: