ఈ మెగా హీరో ఘట్స్ కు హ్యాట్సాఫ్

మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. ఉప్పెన సినిమా తో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా గా కొండ పొలం అనే విభిన్నమైన సినిమాను చేశాడు. మొదటి సినిమా తో వంద కోట్లు దక్కించుకున్న హీరో టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో ఎవరు లేరు అనడంలో సందేహం లేదు.

అంతటి రికార్డు బ్రేకింగ్ వసూళ్లు దక్కించుకున్న వైష్ణవ్ తేజ్ అలాంటి కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

కమర్షియల్ సక్సెస్ ల కోసం అన్నట్లుగా కాకుండా నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు.. అన్ని రకాల పాత్రలు సినిమాలు చేసిన క్రెడిట్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి వైష్ణవ్ తేజ్ ఈసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ మూడవ సినిమా రంగ రంగ వైభవంగా రూపొందుతున్న విషయం తెల్సిందే.

రంగ రంగ వైభవంగా సినిమా టైటిల్ ను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను చూస్తుంటే సినిమా ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ తో సాగుతుందని అనిపిస్తుంది. కాని అసలు విషయం ఏంటీ అంటే ఆ రొమాంటిక్ లవ్ స్టోరీ అనేది సైడ్ ట్రాక్ మాత్రమే అని.. మెయిన్ ట్రాక్ పొలిటికల్ డ్రామా అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ప్రస్తుతం మెగా కాంపౌండ్ నుండి తెగ ప్రచారం జరుగుతోంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక లవ్ స్టోరీతో రంగ రంగ వైభవంగా సినిమా సాగుతుందని అంటున్నారు. వైష్ణవ్ తేజ్ గత రెండు సినిమాల్లోకి ఈ సినిమా లో పూర్తి విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విడుదల అయిన రంగ రంగ వైభవంగా పోస్టర్లు మరియు పాట చూస్తుంటే అర్థం అవుతుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా స్లో అండ్ స్టడీ అన్నట్లుగా కాకుండా సాధ్యం అయినంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.

ఒక్కో సినిమాకు ఏళ్లకు ఏళ్లు సమయం వృదా చేయకుండా ఈయన నుండి బ్యాక్ టు బ్యాక్ ముందు ముందు కూడా సినిమాలు వరుసగా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కమర్షియల్ పాత్రలు సినిమాలు కాకుండా విభిన్నమైన సినిమాలు చేయాలంటే.. అది కూడా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయడం అంటే ఖచ్చితంగా చాలా పెద్ద రిస్క్.

మేన మామల నుండి రిస్క్ ను తీసుకోవడం నేర్చుకున్నాడో ఏమో కాని వరుసగా ఈ మెగా హీరో ప్రయోగాలను చేస్తున్నాడు. మొదటి సినిమాతోనే ఏ ఒక్క హీరో ఒప్పుకోని విషయానికి ఒప్పుకుని మెగా హీరోల్లో తాను స్పెషల్ అన్నట్లుగా నిరూపించుకున్నాడు.

ఆ తర్వాత కొండపొలం అనే ఒక నవల సినిమాను చేసి అందరు తనవైపు తిరిగి చూసుకునేలా చేశాడు. ఇప్పుడు రంగ రంగ వైభవంగా సినిమా తో కూడా ప్రయోగం చేస్తూ మెగా అభిమానులతో నే కాకుండా అందరితో కూడా ఘట్స్ ఉన్న హీరో నీకు హ్యాట్సాఫ్ అనిపించుకుంటున్నాడు.


Recent Random Post: