తమిళ మూవీ ఇయరకై తో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయిన జననాథన్ అనారోగ్యంతో మృతి చెందారు. 61 ఏళ్ల జననాథన్ ఇటీవల అనారోగ్య సమస్యలతో చెన్నై అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గుండె పోటు కారణంగా ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తిరిగి ఆయన మామూలు మనిషి అవుతారని కుటుంబ సభ్యులు భావించారు. కాని ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో డాక్టర్లు కాపాడలేక పోయారు.
ఆయన దర్శకత్వం వహించిన ఒక సినిమా జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కి దర్శకుడు జననాథన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మరణ వార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్తతో తమిళ సినీ ప్రముఖులు విషాదంలో మునిగి పోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు.
Recent Random Post: