అద్దె చెల్లించలేదని నటి సామాన్లు రోడ్డున పడేశారట

తమిళ నటి విజయలక్ష్మి ఈమద్య కాలంలో పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా పలు సినిమాలతో సుపరిచితురాలు అయిన ఈమె కొన్ని నెలల క్రితం తనను కొందరు సోషల్‌ మీడియా ద్వారా వేదిస్తున్నారు అంటూ సోషల్‌ మీడియాలో పదే పదే పోస్ట్‌ లు పెట్టింది. చివరకు ఆత్మహత్య యత్నం కూడా చేసింది. ఈమె ఆత్మహత్య యత్నం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. ఆ తర్వాత సీమన్ కు అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకంగా పని చేసిన ఈమె మళ్లీ వార్తల్లో నిలిచింది.

టీనగర్‌ లోని హబీబుల్లా రోడ్డులో ఒక అపార్ట్‌మెంట్ లో వరలక్ష్మి సోదరితో కలిసి కొంత కాలంగా ఉంటుంది. సోదరి అనారోగ్యం కారణంగా గత కొన్నాళ్లుగా ఆసుపత్రిలో ఉంటున్నారు. నిన్న అపార్ట్‌మెంట్ కు సోదరితో కలిసి వరలక్ష్మి వచ్చేప్పటికి మరో వ్యక్తి ఉన్నారు. మూడు నెలలుగా అద్దె చెల్లించని కారణంగా మీ సామాన్లు తీసేశామని చెప్పారు. దాంతో మీడియాకు పోలీసులకు సమాచారం ఇచ్చిన వరలక్ష్మి అర్ధ రాత్రి నానా రచ్చ చేసింది. నా సామాను బయట పడేసి ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ రాత్రి సమయంలో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గం చూపించారు.


Recent Random Post: