‘బో… డికె’ అర్థం వివరించేశారట నిస్సిగ్గుగా.!

టీడీపీ నేత పట్టాభి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘బో..డికె’ అన్నాడట. పట్టాభి అన్న మాట అక్కడితోనే పోయింది. కానీ, ఆ మాటని పదే పదే వైసీపీ నేతలు ప్రస్తావిస్తూ, తమ పరువే తీసేసుకుంటున్నారు. ‘పట్టాభి అలాగన్నాడు..’ అంటూ, ఏకంగా పట్టాభి ఇంటి మీద, టీడీపీ కార్యాలయం మీదా దాడి చేసేశారు వైసీపీ మూకలు. చెల్లుకు చెల్లు.. అన్నట్టు కాకుండా, ఇంకా ఈ యుద్ధం కొనసాగుతూనే వుంది.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దగ్గరకు కొన్నాళ్ళ క్రితం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్ళారు, టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఫిర్యాదు కూడా చేశారు. రాష్ట్రపతిపాలన విధించాలని కోరారు కూడా. వైసీపీ ఆగుతుందా.? అదే రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. రాష్ట్రపతికి పట్టాభి ఉపయోగించిన ‘బో..డికే’ పదం తాలూకు అర్థాన్ని వివరించింది.

‘ఆయనకు ఆ పదం తాలూకు అర్థం ఎలా వివరించాలో మాకు అర్థం కాలేదు.. ఎలాగోలా, వివరించాం.. అది తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయారు..’ అంటూ వైసీపీ ముఖ్య నేత ఒకరు (పార్టీలో అత్యంత కీలకమైన ప్రజా ప్రతినిథి) మీడియా ముందు సెలవిచ్చారు.

వారెవ్వా.. రాష్ట్ర ప్రతిష్ట గురించి ఎంత గొప్పగా రాష్ట్రపతికే వివరించారబ్బా.? అదేదో ప్రత్యేక హోదా కోసమో, పోలవరం ప్రాజెక్టు గురించో, మూడు రాజధానుల గురించో, శాసన మండలి రద్దు గురించో.. లేదంటే, రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాల గురించో రాష్ట్రపతికి అర్థమయ్యేలా చెప్పి వుంటే బావుండేది కదా.!

అయినా, రాష్ట్రపతికి అంత వివరంగా చెప్పడానికి అంతలా ఇబ్బంది పడాలా.? బూతుల మంత్రిని తీసుకెళితే సరిపోయేదేమో.. బహుశా ఆ ఆలోచన వైసీపీ పెద్దాయనకు వచ్చి వుండదు. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టు తయారైంది వ్యవహారం.

పట్టాభి రగడ తర్వాత వైసీపీ నేతలు, ‘జనాగ్రహ దీక్షలు’ అంటూ బూతు పంచాంగం అందుకున్న వైనం కూడా రాష్ట్రపతి ముందు వైసీపీ బృందం పెట్టి వుంటే బావుండేదేమో.


Recent Random Post: