లండన్ వీధుల్లో వామికతో విరుష్క

టీం ఇండియా ఆటగాళ్లు ఇటీవలే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్ షిప్ ఫైనల్‌ లో ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లారు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అక్కడే ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లాండ్‌ తో సిరీస్ ఆడేందుకు మరి కొంత సమయం ఉన్నా కూడా ఆటగాళ్లను బీసీసీఐ వారు ఇంగ్లాండ్ లోనే ఉంచారు. ఈ సమయంలో వారు లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే కొందరు టీమ్ ఇండియా క్రికెటర్లు మీడియా కెమెరా కంటికి చిక్కారు. ఈసారి అనుష్క మరియు విరాట్‌ కోహ్లీలు లండన్ వీధుల్లో కనిపించారు.

కరోనా ఉన్నా కూడా వారద్దరు మాస్క్ లేకుండా వామికతో చక్కర్లు కొట్టడం కొందరు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మీరు చిన్న పాపాయితో ఇలా మాస్క్ లేకుండా తిరగడం ఏమాత్రం సమంజసం కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే లండన్ లో కరోనా కేసులు కాస్త కుదుట పడ్డాయి. పూర్తి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వారు రోడ్ల మీద చక్కర్లు కొడుతున్నారు అంటూ వారి సన్నిహితులు అంటున్నారు. మొత్తానికి లండన్ వీధుల్లో విరుష్క మరియు వామిక ల ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.


Recent Random Post: