హీరో హిట్లు ఫ్లాపు ట్రాక్ రికార్డు పక్కనపెడితే విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా అధిక శాతం శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని సమాచారం. దీని కోసమే రౌడీ బాయ్ పొట్టి హెయిర్ స్టైల్ తో కొత్త మేకోవర్ చేయించుకున్నాడు. ఇది రెండు భాగాలుగా రానుంది. స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్లే టూ పార్ట్స్ కు వెళ్తున్నామని చెప్పిన నిర్మాత నాగవంశీ విడుదలకు సంబంధించి పవన్ మీద ఆధారపడుతున్నారు.
అదెలా అంటే హరిహరావ్ వీరమల్లు మార్చి 28 అధికారికంగా లాక్ చేసుకుంది. కానీ అంతకన్నా ముందే విడి 12ని అదే తేదీని అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పటికైతే మార్చుకోలేదు కానీ ఒకవేళ వీరమల్లు ఆలస్యమయ్యే పక్షంలో దాన్ని వాడుకోవాలని సితార టీమ్ చూస్తోంది. అయితే నిర్మాత ఏఎం రత్నం ఎట్టి పరిస్థితుల్లో పవన్ సినిమా వాయిదా పడకూడదనే సంకల్పంతో ఆఘమేఘాల మీద బాలన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయిస్తున్నారు. జనవరి 1 నూతన సంవత్సర సందర్భంగా తొలి ఆడియో సింగల్ రిలీజ్ చేయబోతున్నారు. దీన్ని పవర్ స్టార్ స్వయంగా పాడారని ఇన్ సైడ్ టాక్.
ఒకవేళ అదే కనక జరిగే విడి 12 ఏప్రిల్ లేదా మే నెలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడూ పోటీ తక్కువేం లేదు కానీ ఉన్నంతలో వేసవి మంచి సీజన్ అవుతుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న విజయ్ దేవరకొండ సినిమా కోసమే గౌతమ్ తిన్ననూరి కొత్తవాళ్ళతో తీస్తున్న మేజిక్ పనులను పక్కనపెట్టాడు. లేదంటే డిసెంబర్ 21కి రిలీజ్ అయ్యేది. పోస్ట్ పోన్ అయ్యింది కానీ మళ్ళీ ఎప్పుడనేది నిర్ణయించుకోలేదు. ది ఫ్యామిలీ స్టార్ ఫలితంతో షాక్ తిన్న విజయ్ దేవరకొండ ఈసారి సాలిడ్ కంటెంట్ తో వస్తున్నట్టు కనిపిస్తోంది. విభిన్న నేపధ్యాన్ని ఎంచుకోవడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.
Recent Random Post: