‘కమలా’ పేరు ఉంటే వండర్ లా ఫ్రీ ఎంట్రీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా భారతీయ మహిళ కమలా హారిస్ ఎన్నిక అయిన విషయం తెల్సిందే. ఆమె విజయంను కొందరు ఇండియన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కొన్ని సంస్థలు విభిన్నంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో వండర్‌లా మరో అడుగు ముందుకు వచేసింది. వండర్ లా వారు 24-01-2021 న కమలా అనే పేరు ఉన్న వారికి ఫ్రీ ఎంట్రీని కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది. ఫ్రీ ఎంట్రీ మాత్రమే కాకుండా లోపల ఎంత అయినా ఎంజాయ్ చేసే అవకాశంను ఇచ్చింది.

కమలా పేరు ఉన్న వారు వెంటనే త్వరపడండి. ఒక్కరోజు మాత్రమే అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా ఎన్నిక అయినందుకు ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా కమలా అనే పేరు ఉన్న వారికి మాత్రమే. ఆఫర్‌ వింటుంటే బాగానే ఉంది. కాని ఆమెను పేరుతో ఉన్న వారు ఎంత మంది ఉంటారు. అలాగే వారికి ఎంత మందికి వండర్ లా దగ్గర ఉండి ఉంటుంది. దేశం మొత్తం మీద కనీసం పది మంది అయినా ఈ ఆఫర్ ను వినియోగించుకుంటారా అంటే అనుమానమే. మొత్తానికి వండర్ లా వారు తమ ప్రమోషన్ కోసం మంచి ప్లాన్‌ చేశారు.


Recent Random Post: