‘పప్పు’ అంటూ రాజకీయాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించీ, తెలుగునాట నారా లోకేష్ గురించీ సెటైరికల్‌గా ప్రస్తావించడం అంరదికీ తెలిసిన విషయమే. ఈ ‘పప్పు’ విషయంలో కొందరికి మాత్రమే పేటెంట్ వుందనుకుంటే అది పొరపాటే అవుతుంది. టీడీపీ పదే పదే, ‘గన్నేరు పప్పు’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటుంది.
నారా లోకేష్ కొన్ని పదాల్ని మాట్లాడేటప్పుడు నోరు తిరగక నానా తంటాలూ పడుతూ, ఒక్కోసారి ‘బూతు’ అర్థం వచ్చేలా మాట్లాడేయడం చూశాం, చూస్తూనే వున్నాం. అదో పెద్ద నేరం.. అని ఎవరూ అనరుగానీ, ఆ పొరపాటు కారణంగా రాజకీయ ప్రత్యర్థులకు అడ్డంగా దొరికేస్తుంటారు.
ఒకరు ఇంకొకర్ని వెటకారం చేస్తే, ఆటోమేటిక్‌గా అదే వెటకారం తిరిగొచ్చి అంతకంటే గట్టిగా చెంప దెబ్బ కొట్టేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో అదే జరుగుతోందిప్పుడు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆంద్రప్రదేశ్‌లో పర్యటించిన క్రమంలో.. ఆయన మీద అభినందనల జల్లు కురిపించేందుకు, ‘స్వామిభక్తి’ చాటుకునేందుకు (నిజమేనా.? అలాగని టీడీపీ విమర్శిస్తోంది సుమీ) ‘వన్నె తెచ్చిన’ అని వాడాల్సిన చోట, ‘వెన్న తెచ్చిన..’ అనేశారు సీఎం వైఎస్ జగన్.
రహదారులు.. అనడానికి వైఎస్ జగన్ పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. గతంలో ఇలాంటి జ్ఞాన గుళికలు చాలానే వైఎస్ జగన్ నోట బయటకు వచ్చాయి. చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఇంకొకరైనా.. ఇలా పదాల్ని పలికే విషయంలో ఇబ్బందులు పడటం కొత్తేమీ కాదు.
కానీ, వైసీపీ శ్రేణులు ఇతర పార్టీలకు చెందిన నేతల భాషా ప్రావీణ్యంపై సోషల్ మీడియా వేదికగా ఉద్యమం చేస్తారు కదా.? అందుకే, వైఎస్ జగన్.. ఇతర రాజకీయ పార్టీలకు ఇలాంటి విషయాల్లో ఈజీ టార్గెట్ అయిపోతారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, అనర్గళంగా ఏ విషయాన్నయినా మాట్లాడేస్తారు. వైఎస్ జగన్ అలాక్కాదు, చూసి కూడా తప్పులు మాట్లాడేస్తున్నారన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న విమర్శ.
Recent Random Post: