అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి.. అంటూ వైసీపీ గడచిన కొంత కాలంగా ఏవేవో ‘కట్టు కథలు’ చెబుతూ వస్తోంది. రాష్ట్ర ప్రజల్ని వంచిస్తోంది. అసలు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి.? పాలనా వికేంద్రీకరణ అంటే ఏంటి.? ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అదెంతవరకు సాధ్యం.? అన్న విషయాలపై కనీస ‘ఇంగితం’ లేకుండా వ్యవహరిస్తోంది వైసీపీ.
మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అన్ని సమీకరణాల్నీ పరిగణనలోకి తీసుకుని, ‘మేం ఉద్ధరించేశాం..’ అంటూ ఏవేవో కథలు చెబుతున్నారు వైసీపీ నేతలు. సామాజిక వర్గ సమీకరణాల ప్రకారమే మంత్రి పదవులు ఇచ్చుకున్నామన్నది వైసీపీ వాదన.
ఎవరికి ఏ శాఖ దక్కినా, సకల శాఖల పెత్తనం హైలీ రెస్పెక్టెడ్ సామాజిక వర్గానికి చెందిన ‘సలమాదారు’దేనన్నది ఓపెన్ సీక్రెట్. అలాంటప్పుడు, వికేంద్రీకరణ అనీ, ఇంకోటనీ.. కథలు చెబితే ఎలా.?
ఇప్పుడిక పార్టీ పదవుల పంపకం విషయానికొస్తే, రాష్ట్రంలో 26 జిల్లాలున్నాయిప్పుడు.. మొన్నీమధ్యనే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది కదా.. లేకపోతే అంతకు ముందు 13 జిల్లాలే వుండేవి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి మెజార్టీ నియోజకవర్గాల్ని, జిల్లాల్ని అప్పగించేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులకూ కీలకమైన జిల్లాల బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
మరి, ఇక్కడ సామాజిక వర్గ సమీకరణాలు గుర్తుకు రాలేదు.. వికేంద్రీకరణ ఆలోచనే రాలేదు. కానీ, వైసీపీలో ఎవరూ ఈ విషయమై అధినాయకత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. నందిని చూపించి పంది అనమంటే, వైసీపీలో అంతా అలాగే అనాలి.. అదీ ఆ పార్టీ అధిష్టానం ప్రదర్శించే వైఖరి.
ఆయా జిల్లాల బాధ్యతలు ఆయా నేతలకు కట్టబెట్టడమంటే పార్టీ పరమైన పాలన లాంటిదే ఇది. ఇక్కడ వికేంద్రీకరణ లేకపోతే ఎలా.? సామాజిక వర్గ సమీకరణాలు పాటించకపోతే ఎలా.? చెప్పేటందుకే నీతులు, పాటించడానికి కాదని వైసీపీ మరోమారు స్పష్టంగా నిరూపించేసింది.
Recent Random Post: