ఏపీ సీఎం అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఆయన ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు. సీఎంగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్ పై బయట ఉండి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారు.. విచారణకు సరిగా హాజరు అవ్వడం లేదు అంటూ సీబీఐ కోర్టులో వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటీషన్ వేసిన విషయం తెల్సిందే.
సుదీర్ఘ కాలంగా ఆ పిటీషన్ పై విచారణ జరిగింది. ఎట్టకేలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై వాదనలు ముగిశారు. తీర్పును వాయిదా వేసిన కోర్టు తాజాగా విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై కూడా విచారణ పూర్తి అయ్యింది. రెండు కేసులకు సంబంధించి లింక్ ఉంది కనుక రెండు పిటీషన్ లపై తీర్పు ను ఒకే సారి ఇవ్వబోతున్నట్లుగా కోర్టు పేర్కొంది.
Recent Random Post: