కేసీఆర్ దేశాన్ని ఏలడమా..? అదో పెద్ద జోక్: వైఎస్ షర్మిల

ప్రస్తుతం ఉన్నది బంగారు తెలంగాణ కాదని.. బానిసత్వపు తెలంగాణ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు అనర్హుడని అన్నారు. కేసీఆర్ దేశాన్ని ఏలడమన్నది పెద్ద జోక్ గా అభివర్ణించారు.

రాష్ట్రంలో కనీసం నచ్చిన పంట వేసుకునే స్వేచ్ఛ కూడా లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 59 ఏళ్లు దాటిన రైతులకు బీమా ఎందుకు వర్తించట్లేదనీ.. 66లక్షల మంది రైతుల్లో 41లక్షల మంది రైతులకే బీమా వర్తింపా..? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో బడులు, గుడుల కంటే మద్యం షాపులే ఎక్కువగా ఉన్నాయని.. రాష్ట్రాన్ని తాగుబోతుల, అప్పుల, ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.

కేటీఆర్ ప్రజల్ని ప్రాంతీయతత్వంతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు..? అది సాధ్యమా..? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎంత త్వరగా ఎన్నికలు వస్తే తెలంగాణకు అంత మంచిదని షర్మిల అన్నారు.


Recent Random Post: