అంతరిక్షంలో షూటింగ్ చేసిన మొదటి మొనగాడు!

Share

వెండితెరపై హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ సాహసవిన్యాసాలు భారీ స్టంట్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. తన ప్రాజెక్ట్ లలో హై-ఆక్టేన్ స్టంట్ లతో తదుపరి స్థాయిని ఆవిష్కరిస్తున్నాడు. అతడు గాల్లో ఎగిరే విమానాలపై రియల్ స్టంట్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. త్వరలో అంతరిక్షంలో షూట్ చేసిన మొదటి నటుడిగా అతడు మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు.

ఇటీవలే యుద్ధ విమానాల శిక్షణ నేపథ్యంలోని ‘టాప్ గన్’ మూవీతో అతడు రికార్డ్ హిట్ అందుకున్నాడు. నటుడు దర్శకుడు డగ్ లిమాన్తో స్పేస్ వాక్ నేపథ్యంలోని ప్రాజెక్ట్ లో టామ్ భాగస్వామిగా ఉన్నారని తెలిసింది. హాలీవుడ్ నటుడు దర్శకుడు టామ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వరకు వెళ్లేందుకు సాహసిస్తున్నాడు. తన కెరీర్ లో ప్రయోగాలను మరో దశకు తీసుకుని వెళుతున్నాడు. దీనికోసం అతడు యూనివర్సల్ ఫిల్మ్డ్ ఎంటర్ టైన్ మెంట్ గ్రూప్ (UFEG)ని సంప్రదించినట్లు కథనాలొస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్ మొదట 2020లో చేయాలని భావించారు. కానీ కోవిడ్-19 వ్యాప్తి ప్రాజెక్ట్ ను నిలిపివేసింది. ఈ చిత్రం ప్రస్తుతం కాన్సెప్ట్ దశలో ఉంది. ఇంకా షూటింగ్ ప్రారంభించలేదు. ఇంతకుముందు ప్రకటించినట్లుగా ఈ చిత్రం విజయవంతమైతే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిత్రీకరించే మొదటి సినీ ప్రముఖుడు టామ్ క్రూజ్ అవుతాడు. ఈ చిత్రానికి దాదాపు 200 మిలియన్ల డాలర్ల ఖర్చవుతుందని కథనాలొస్తున్నాయి. అయితే నిర్మాతలు ఇంకా తుది బడ్జెట్ ను ఖరారు చేయలేదని తెలిసింది. బహుశా టామ్ క్రూజ్ అతని చిత్ర బృందం తో కలిసి అంతరిక్షానికి వెళ్లడానికి భారీ ప్యాకేజీని కేటాయించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఎడ్జ్ ఆఫ్ టుమారో కాంబినేషన్ రిపీట్..ఏది ఏమైనా టామ్ స్పేస్ వాక్ చేసిన మొదటి నటుడిగా సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. యూనివర్సల్ పిక్చర్స్ అధినేత డోనా లాంగ్లీ- దర్శకుడు డగ్ లిమాన్ తో ఈ కొత్త యాక్షన్ చిత్రం కోసం ప్రయత్నిస్తున్నామని ఒక ఇంటర్వ్యూలో టీజ్ చేసారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కానీ టామ్ కూడా స్పేస్ వాక్ చేయాలనే ప్లాన్ ఉందని లాంగ్లీ చెప్పారు.

లాంగ్లీ BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధృవీకరించారు టామ్తో కలిసి ఒక ప్రాజెక్ట్ అభివృద్ధి దశలో ఉంది. అంతరిక్ష కేంద్రానికి రాకెట్ని తీసుకెళ్లి షూటింగ్ చేయడం .. అంతరిక్ష కేంద్రం వెలుపల స్పేస్ వాక్ చేసిన మొదటి పౌరుడిగా నిలవడం కుదురుతుందని భావిస్తున్నామని లాంగ్లీ అన్నారు.

ఈ సినిమా కథ కూడా ఆసక్తికరం. దాని ప్రకారం… టామ్ క్రూజ్ అదృష్టాన్ని కోల్పోయే దురదృష్ట జాతకుడి పాత్రను పోషిస్తాడు. అతను భూమిని మాత్రమే రక్షించగల అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటాడు. ఈ బృందం ప్రస్తుతం NASA -ఎలోన్ మస్క్ SpaceX కంపెనీ రెండింటితో కలిసి సజావుగా సినిమాని నిర్మించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అంతరిక్షంలో చలనచిత్రాన్ని చిత్రీకరించిన మొదటి హాలీవుడ్ స్టూడియో కూడా వారిదే కానుంది. దర్శకుడు లిమాన్ – క్రూజ్ ఇంతకు ముందు ‘ఎడ్జ్ ఆఫ్ టుమారో’ (2014) -‘అమెరికన్ మేడ్’ (2017) వంటి చిత్రాలకు కలిసి పని చేసారు.


Recent Random Post:

Operation Sindoor Is Ongoing- Indian Army Chief Upendra Dwivedi Warns Pak

January 13, 2026

Share

Operation Sindoor Is Ongoing- Indian Army Chief Upendra Dwivedi Warns Pak