అఖండ 2: అఘోరాల మధ్య కుంభమేళా వేదికగా బాలయ్య సంచలనం


హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న దర్శకుడు బోయపాటి శ్రీను, అఖండ 2 కోసం రెడీ అవుతూ మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు. ఈసారి ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా నేపథ్యంగా చిత్రీకరణ జరపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రోజుకు యాభై లక్షలకుపైగా భక్తులు హాజరవుతున్న ఈ ఉత్సవం వేదికగా కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించడం భారీ సవాలుగా నిలిచింది.

అఘోరాల విన్యాసాలు, సన్యాసుల సమూహాలు, దేవతా ఊరేగింపులు, భక్తుల ఉత్సాహం వంటి దృశ్యాలు కేవలం రియల్ లొకేషన్‌లలోనే సాధ్యమయ్యే ప్రత్యేకతలుగా నిలుస్తాయి. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న కుంభమేళా సందర్బంగా బోయపాటి కొన్ని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన ఫుటేజ్‌ను చిత్రీకరించినట్లు సమాచారం.

అఖండ 2 కథ మొత్తం పెద్ద బాలయ్య పాత్ర చుట్టూనే తిరుగనుంది. లోకాన్ని నాశనం చేయడానికి పూనుకున్న దుష్టశక్తులను అణచివేసేందుకు అపారమైన దివ్యశక్తులను ఉపయోగించే కథనం ఈ సినిమాకి హైలైట్ కానుంది. ఈ నేపథ్యంతో కొన్ని కీలక సన్నివేశాలు తెరపై అద్భుతంగా అలరిస్తాయని తెలుస్తోంది.

సెప్టెంబర్ విడుదలను లక్ష్యంగా చేసుకున్న ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను బోయపాటి శీను పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేసే పనిలో ఉన్నారు. బాలకృష్ణ తన పూర్తి డేట్లను ఈ సినిమాకి కేటాయించనున్నారని సమాచారం.

సింహా, లెజెండ్, అఖండలతో ఘన విజయాలు అందుకున్న బాలయ్య-బోయపాటి కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్, ఐదవ సారి బాలయ్యకు చార్ట్ బస్టర్ బీజీఎమ్ మరియు పాటలు అందించేందుకు సిద్ధమవుతున్నాడు. మొదటి భాగంలో కనిపించిన ప్రగ్యా జైస్వాల్‌తో పాటు ఇతర తారాగణం ఈ సినిమాలో భాగస్వామ్యం కానుంది.

అఖండ 2 ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునే అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసంతో ఉంది.


Recent Random Post: