అట్లీ ప్లాన్ చేస్తున్న మల్టీస్టారర్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్!

Share


ప్రస్తుతం మల్టీస్టారర్ల ట్రెండ్ పలు ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారింది. హీరోలు కూడా మల్టీస్టారర్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ క‌లిసి “ఆర్ఆర్ఆర్” సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద దృష్టిని ఆకర్షించి సునామీ సృష్టించారు. ఇప్పుడు, ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో బాలీవుడ్‌లో “వార్ 2” సినిమాను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వస్తోంది.

“జవాన్” సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన అట్లీ, ఈ సినిమాతో దేశమంతటా దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అట్లీ తరువాత తనతో కొత్త ప్రాజెక్ట్ చేయాలన్న అంచనాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం అట్లీ కొత్త మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

ఈ మల్టీస్టారర్‌లో కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నిజమైతే, ఈ సినిమా ప్రకటించిన వెంటనే భారీ హైప్ నెలకొనడం ఖాయం.

గతంలో అట్లీ తన తదుపరి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి సినిమా స్క్రిప్ట్ వర్క్స్‌లో ఉన్నప్పటికీ, ఆ సినిమాలో ఉన్న స్టార్లు అందరినీ ఆశ్చర్యపరచబోతున్నారనీ, ఆ సినిమా అవుట్ ఆఫ్ ది వర్డ్ ఐడియాతో రూపొందుతోందని ఆయన చెప్పారు. దీంతో, ఈ మల్టీస్టారర్ సినిమానే అట్లీ చెప్పిన ప్రాజెక్టు కావచ్చని తాజా వార్తలు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.

అట్లీ ఇటీవల “తేరీ” సినిమాను బాలీవుడ్‌లో “బేబీ జాన్” పేరుతో రీమేక్ చేసి విడుదల చేశాడు, కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ప్రస్తుతం, రజనీకాంత్ “లోకేష్ క‌న‌గ‌రాజ్” దర్శకత్వంలో “కూలీ” సినిమాను చేస్తున్నాడు, అది పూర్తయిన తరువాత “నెల్స‌న్” దర్శకత్వంలో “జైల‌ర్ 2” చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్‌తో “సికిందర్” సినిమా చేస్తున్నాడు. అట్లీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ నిజమైతే, రజనీకాంత్, సల్మాన్ ఖాన్ తమ క‌మిట్‌మెంట్‌లు పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.


Recent Random Post: