“అతడు” టీవీ చరిత్రలో అరుదైన రికార్డు!

Share


తెలుగు ప్రేక్షకులకు ఎనలేని అభిమానాన్ని సంపాదించిన చిత్రాల్లో అతడు ప్రత్యేక స్థానం దక్కించుకుంది. మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2005లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. అయితే, టెలివిజన్‌లో ఈ సినిమా తిరుగులేని ప్రజాదరణను అందుకుంది.

సినిమా విడుదల తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే మా టీవీ వంటి ప్రముఖ చానళ్లలో ఈ చిత్రాన్ని అనేకసార్లు ప్రసారం చేశారు. మొదట్లో నెలకోసారి, ఆ తర్వాత వారానికి ఒక్కసారి, చివరికి రెండు మూడు రోజులకోసారి టెలికాస్ట్ అయ్యే స్థాయికి చేరుకుంది. అయినా ప్రేక్షకులు ఎంతసార్లైనా చూసేందుకు ఆసక్తి చూపారు. సినిమాకు సంబంధించిన డైలాగులు కంఠతా వచ్చేసినా, వచ్చిన ప్రతీసారి అదే ఉత్సాహంతో చూసేలా చేసింది అతడు మ్యాజిక్.

ఇలా అతడు ఇప్పటివరకు ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయ్యి ప్రపంచ సినిమా చరిత్రలో ఓ విపరీతమైన రికార్డును నెలకొల్పింది. ఇప్పటివరకు మరే సినిమా కూడా వెయ్యిసార్లు ప్రసారం అవ్వకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి ఈ రికార్డు భవిష్యత్తులో ఎవరైనా అధిగమించడం చాలా కష్టమని అభిప్రాయపడుతున్నారు.

ఈ రికార్డు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అయితే, “ఇది మహేష్ స్టామినాకే సాధ్యం!” అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ స్టోరీ టెల్లింగ్, మహేష్ బాబు స్టైలిష్ పెర్ఫార్మెన్స్, ట్రెండీ డైలాగులు, త్రివిక్రమ్ మార్క్ భావోద్వేగాలు – ఇవన్నీ కలిపి అతడుని ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా నిలిపాయి.

ఏదేమైనా, 1500 సార్లు టెలికాస్ట్ అయిన ఏకైక సినిమా అనిపించుకున్న అతడు రికార్డు భవిష్యత్తులో మరెవరైనా అధిగమిస్తారా లేదా అనేది చూడాలి!


Recent Random Post: