అనుష్క శెట్టి పేరు వెనుక ఆసక్తికర కథ

Share


అనుష్క శెట్టి తెలుగు సినీ ప్రేక్షకులను తన అందం, అభినయంతో అలరించిన నటి. నాగార్జునతో చేసిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అద్భుతమైన క్రేజ్ సంపాదించింది. నటనలోనూ, గ్లామర్ రోల్స్‌లోనూ మెప్పించిన అనుష్క, అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తన ప్రతిభను చాటుకుంది. బాహుబలిలో దేవసేన పాత్రతో ఆమె నటన కొత్త స్థాయిలో నిలిచింది.

కానీ సైజ్ జీరో, నిశ్శబ్దం వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోవడంతో కొంతకాలం వెనుకంజ వేసింది. ఇటీవల నవీన్ పోలిశెట్టితో చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ సినిమా చేస్తోంది. అంతేకాక, కల్కి 2లో కీలక పాత్రలో కనిపించే అవకాశముందని టాక్ ఉంది.

ఇదిలా ఉండగా, అనుష్క శెట్టిగా ఎలా మారిందో చెప్పిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె మాట్లాడుతూ –

“నా అసలు పేరు స్వీటీ శెట్టి. సూపర్ సినిమా కోసం పేరు మార్చుకోవాలని అనుకున్నాను. అప్పట్లో నాన్నగారు, నాగార్జున గారు ‘స్మృతి శెట్టి’ అని పెట్టుకోమన్నారు. కానీ ఆ పేరు నాకు నచ్చలేదు. అప్పుడు చివరికి అనుష్క శెట్టిగా ఫిక్స్ అయ్యాను. నా పేరును మార్చుకునే అదృష్టం నాకు దక్కింది,” అని అనుష్క చెప్పింది.


Recent Random Post: