
స్టార్ హీరోయిన్లు పబ్లిక్‌లో కనిపించిన ప్రతీసారి ఫ్యాన్స్ ఎగబడటం, తోపులాట జరగడం ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. రీసెంట్‌గా జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో స్టార్ హీరోయిన్లు సమంత మరియు నిధి అగర్వాల్ కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ ఇద్దరూ చాలా మెచ్యూర్డ్‌గా స్పందించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ముందుగా సమంత విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో ఆమెను ఫ్యాన్స్ చుట్టుముట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన చాలామందికి ఆమె సేఫ్టీపై ఆందోళన కలిగింది. కానీ సమంత మాత్రం ఎలాంటి పానిక్‌కు గురికాకుండా చాలా కూల్‌గా స్పందించారు. ఫ్యాన్స్ తనను కలవడానికి, ఫోటోలు దిగడానికి మాత్రమే వస్తారని, హాని చేసే ఉద్దేశం వాళ్లకు ఉండదని ఆమె స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో తనకు పూర్తి భద్రత ఉందని కూడా క్లారిటీ ఇచ్చారు.
అదే సమయంలో సమంత 2025 గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం మరింత ఆసక్తికరంగా మారాయి. ఈ ఘటనపై స్పందిస్తూనే, 2025 తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని, ముఖ్యంగా తాను పెళ్లి చేసుకున్నానని ఆమె వెల్లడించడం సెన్సేషన్‌గా మారింది. ఇది తన జీవితంలో జరిగిన బెస్ట్ థింగ్ అని చెప్పిన సమంత, నిర్మాతగా మారి సొంత సినిమా తీయడం కూడా తనను కొత్త వ్యక్తిగా మార్చిందని పేర్కొన్నారు.
మరోవైపు ‘రాజా సాబ్’ బ్యూటీ నిధి అగర్వాల్ ఎదుర్కొన్న పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఆమె రీసెంట్‌గా బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ కొంత అతిగా ప్రవర్తించడంతో తోపులాట జరిగింది. ఆ సమయంలో నిధి చాలా అసౌకర్యానికి గురైనట్లు, ఫ్యాన్స్ బ్రూటల్ బిహేవియర్ వల్ల అన్ ఈజీగా ఫీల్ అయినట్లు వీడియోల ద్వారా స్పష్టంగా కనిపించింది. ఆ వీడియోలు చూసిన ఎవరైనా సరే, ఆ పరిస్థితిలో సీరియస్ అవ్వడం సహజమే.
కానీ నిధి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను ఇంత ఇబ్బంది పడ్డప్పటికీ, ఫ్యాన్స్‌పై కేసు పెట్టడానికి గానీ, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గానీ ఆమె నిరాకరించారు. వాళ్లది అభిమానమే తప్ప, ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని భావించి, జరిగిన విషయాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నారట. ఇది ఆమె సహనం, పెద్ద మనసుకు నిదర్శనంగా మారింది.
ఇలా సమంత, నిధి ఇద్దరూ కూడా అభిమానుల అత్యుత్సాహాన్ని చాలా పాజిటివ్‌గా తీసుకొని, ఎలాంటి వివాదాలకు దారి తీసకుండా సింపుల్‌గా వదిలేశారు. సమంత తానికేమీ భయం లేదని ధైర్యంగా చెప్పగా, నిధి కంప్లైంట్ కూడా వద్దని చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నారు.
స్టార్స్ ఇంత ఓపికగా, అర్థం చేసుకునే మనసుతో ఉంటే, ఫ్యాన్స్ కూడా వారి పర్సనల్ స్పేస్‌ను గౌరవిస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Recent Random Post:














