అభిషేక్ బచ్చన్ ఘాటు సమాధానం జర్నలిస్టుకు

Share


జర్నలిస్టులు మరియు సెలబ్రిటీల మధ్య ఉన్న సంబంధాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కొందరు జర్నలిస్టులు నిజాయితీగా అడిగే ప్రశ్నలకు కూడా సెలబ్రిటీలు ఫీలవుతారు, మరికొందరు మాత్రం వెగటుగా, వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. అలాంటి సందర్భంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఒక జర్నలిస్టు అభిషేక్ బచ్చన్ గురించి మాట్లాడుతూ, “అతనికి కెరీర్‌లో ఒక్క సోలో హిట్ కూడా లేకపోయినా, మంచి పీఆర్ మరియు ఇండస్ట్రీలో ఉన్న సంబంధాల కారణంగా అవార్డులు దక్కుతున్నాయి” అని వ్యాఖ్యానించాడు. అంతేకాక, “అభిషేక్ బచ్చన్ ‘I Want To Talk (2025)’ చిత్రానికి గాను ఫిలింఫేర్ అవార్డును కొనుగోలు చేశాడు, ఈ సినిమా థియేటర్లలో కూడా పెద్దగా ఆడలేదు” అని విమర్శించాడు.

దీనికి స్పందించిన అభిషేక్ బచ్చన్, “నేను అవార్డులు ఎప్పుడూ కొనలేదు. నాకు దూకుడు పీఆర్ టీమ్ కూడా లేదు. కష్టపడి పనిచేయడం, చెమటోడ్చి సాధించడం నా మార్గం. మీరు నమ్మకపోవచ్చు కానీ, నా భవిష్యత్ విజయాలతోనే నేను మిమ్మల్ని తప్పు అని నిరూపిస్తాను. గౌరవంతో, సహనంతో ముందుకు సాగుతాను” అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

అభిషేక్ సమాధానానికి ఆ జర్నలిస్టు కూడా సాఫ్ట్ అయ్యి, “మీ నటన, ప్రవర్తన గురించి ఎన్నోసార్లు నేను మంచి విషయాలే రాశాను. అవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే, దురుద్దేశం కాదు. మీరు మెయిన్‌స్ట్రీమ్ సినిమాల్లో ప్రధాన పాత్రల్లో ఎక్కువగా కనిపించాలని కోరుకుంటున్నాను. మీరు ఈ తరంలో అత్యంత సౌమ్యమైన నటుడు” అంటూ ప్రతిస్పందించాడు.

ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ బాలీవుడ్‌లో బిజీగా ఉన్నాడు. నటనతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా భారీ పెట్టుబడులు పెట్టి పెద్ద లాభాలు ఆర్జిస్తున్నాడు. తెలివైన వ్యాపారవేత్తగా, నిపుణుడిగా కూడా బాలీవుడ్‌లో అభిషేక్ పేరు గౌరవంగా నిలుస్తోంది.


Recent Random Post: