సీనియర్ స్టార్ హీరో మాధవన్ వరుసగా సినిమాలు, సిరీస్ లు అంటూ దూసుకు వస్తున్నాడు. ఆ మధ్య మాధవన్ పని అయిపోయిందని కామెంట్స్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన తన వయసుకు తగ్గ పాత్రలు కమిట్ అవుతూ, యూనివర్శిల్ సబ్జెక్ట్ లను ఎంపిక చేసుకుంటూ సినిమాలు, సిరీస్ లు చేయడం ద్వారా మళ్లీ బిజీ అవ్వడం మాత్రమే కాకుండా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
తాజాగా మాధవన్ ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ లో నటించాడు. ఆ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరీస్ లో తనతో నటించిన సహ నటి జూహీ చావ్లా గురించి, ఆమె పై తనకు యంగ్ ఏజ్ లో ఉన్న ప్రేమ మరియు అభిమానం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాను చూసిన సమయంలో నేను ఆ సినిమాలో హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ సినిమాలోని హీరోయిన్ జూహీ చావ్లా పై అప్పటి నుంచే విపరీతమైన అభిమానం పెంచుకున్నాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అంటూ అమ్మకి కూడా చెప్పాను.
జూహీ నటిగా కెరీర్ ఆరంభించిన సమయంలో మాధవన్ ఇంకా కెరీర్ ను ప్రారంభించలేదు. అయినా కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం నిజంగా విడ్డూరంగా ఉందని కొందరు అంటూ ఉంటే, కొందరు జూహీ పై అతడిది అభిమానం కాదు, అంతకు మించి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ది రైల్వే మెన్ వెబ్ సిరీస్ లో జూహీ తో కలిసి నటించిన అనుభవం గురించి మాట్లాడుతూ మాధవన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. జూహీ ని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నట్లుగా మాధవన్ కి జరగలేదు. అలాగే జూహీ కూడా ఇప్పటికే మరో వ్యక్తిని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. ఇద్దరు ఇప్పుడు కలిసి నటించారు.
Recent Random Post: